ఇది ఆంధ్రజ్యోతి లో వచ్చిన కాలమ్ .

జయశంకర్ గారు ఉర్దూ భాష గురించి అది ఒక సంపన్నమైన భాష అని, మధురమైన భారతీయ భాష అని, దేశంలో మాట్లాడే భాషలన్నీ హిందువుల భాషలని, ఉర్దూ కూడా భారతదేశంలో పుట్టి, విస్తరించి అనేక భారతీయ భాషలను ప్రభావితం చేసి,  వాటితో ప్రభావితమైన భాష అని తెలియ చేసారు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు. Bookmark the permalink.

4 Responses to ఇది ఆంధ్రజ్యోతి లో వచ్చిన కాలమ్ .

  1. saamaanyudu says:

    great article…

    Like

  2. ఉర్దూ ఏమీ మనం అనుకున్నంత గొప్ప భాష కాదులే. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉర్దూ పదాలు కలపకుండా సంస్కృత పదాలు కలిపిన హిందీ భాష మాట్లాడితే నవ్వుతారు కానీ చత్తీస్‌గఢ్‌లో ఉర్దూ పదాలు కలిపిన హిందీ భాష మాట్లాడితే అక్కడివాళ్ళకి అర్థం కాదు. మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్ చాలా కాలం పాటు మరాఠాల పాలనలో ఉండేవి కనుక అక్కడివాళ్ళకి ఉర్దూ అంతగా రాలేదు. మన ప్రాంతం చాలా కాలం పాటు ముస్లింల పాలనలో ఉండింది కనుక ఇక్కడివాళ్ళకి ఉర్దూ పదాలు బాగా వచ్చాయి, అంతే.

    Like

  3. ఉర్దూ కారణంగా మన భాష ఎంతో భ్రష్టుపట్టిపోయింది. “శ”ని “ష” అని పలకడం, “శ” అని స్వచ్ఛంగా పలికేవాళ్ళని అదోలా చూడడం కనిపిస్తోంది. “శ”ని ఉర్దూ శైలిలో “ష” అని పలికేవాళ్ళు ఇస్తున్న జస్టిఫికేషన్ నమ్మశక్యంగా లేదు. వాళ్ళు సాధారణ ప్రజలకి “శ”కీ, “ష”కీ తేడా తెలియదు అని వాదిస్తారు. అది నిజం కాదు. పల్లెటూర్లలో శాలని సాల అనడం చూశాను కానీ షాల అనడం ఎక్కడా చూడలేదు. ఎందుకంటే “శ”ని “ష” అని పలకడం ఉర్దూ శైలే కానీ పల్లెటూరి శైలి కాదు. వికీపీడియా లాంటి వెబ్‌సైట్‌లలో మనం “శ”కి సూచనగా “sa” అని వ్రాస్తే ఎవరో ఒకరు ఎడిట్ చేసి “sha” అని వ్రాసేస్తారు. మనం శివాజీ అని వ్రాస్తే వాళ్ళు ఎడిట్ చేసి షివాజీ అని వ్రాసేస్తారు. శింధే (శింధియా) అనే మరాఠా ఇంటి పేరుని ఇంగ్లిష్‌లో షిండే అని వ్రాస్తారు. మనం శింధే అని కరెక్ట్‌గా వ్రాసినా దాన్ని ఎడిట్ చేసి షిండే అని వ్రాసేస్తారు. ఉర్దూని గుడ్డిగా అనుకరిస్తే ఇలాగే తేడాలు వస్తాయి.

    Like

  4. అజ్ఞాత says:

    Sarma నెలా పలకాలి?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.